Saturday, May 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాజకీయాలకతీతంగా నగర ప్రగతి

రాజకీయాలకతీతంగా నగర ప్రగతి

- Advertisement -

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
అమీన్‌పూర్, బీరంగూడ పరిధిలో రూ.3 కోట్ల 68 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ – అమీన్‌పూర్
పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్‌పూర్, బీరంగూడ డివిజన్లలో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం అమీన్‌పూర్, బీరంగూడ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో సుమారు మూడు 3 కోట్ల 68 లక్షల పైచిలుకు నిధులతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి  పనులకు పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.  ఈ నిధులతో సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తదితర మౌలిక వసతుల పనులను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కాలనీవాసులను ఉద్దేశించి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడారు. తాము ఎల్లప్పుడూ రాజకీయాలకతీతంగా, కేవలం నగర ప్రగతిని మాత్రమే లక్ష్యంగా చేసుకుని ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. స్థానిక కాలనీవాసులను, వివిధ పార్టీల నాయకులను కలుపుకుంటూ అందరి సహకారంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరానికి ఆనుకుని ఉన్న బీరంగూడ, అమీన్‌పూర్ ప్రాంతాలు రోజురోజుకూ పెద్ద ఎత్తున విస్తరిస్తున్నాయని, జనాభా సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందని ఆయన గుర్తుచేశారు. ఈ క్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి అత్యవసర మౌలిక వసతులు కల్పించడమే తమ ప్రథమ ప్రాధాన్యత అన్నారు.

ప్రజల సమస్యలను పరిష్కరించడంలోనూ, మౌలిక వసతులు కల్పించడంలోనూ ఎక్కడా, ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ శంకుస్థాపనల ఉత్సవంలో స్థానిక మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి మరియు వైస్ చైర్మన్  నరసింహ గౌడ్ మాజీ కౌన్సిలర్లు, పలువురు ముఖ్య నాయకులతో కలసి బీరంగూడ డివిజన్ పరిధిలోని లక్ష్మీ సాయి మెడోస్, కిష్టారెడ్డిపేటలోని  దుర్గా నగర్, టైలర్స్ కాలనీలో సిసి రోడ్డు పనులకు, ఓడిఎఫ్ కాలనీ అండర్ డ్రైనేజీ  పనులకు అదేవిధంగా పిఎన్ఆర్ కాలనీ పంచ తత్వ పార్క్ లో బోర్వెల్, ఓపెన్ జిమ్ పనులకు, వాణి నగర్ లోని కోకోల నుండి వాణి నగర్ వరకు అండర్ డ్రైనేజీ పనులు, ఆర్టీసీ కాలనీలో సిసి రోడ్డులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు.

సంక్షేమ సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. తమ కాలనీల్లో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేసి, పనులు ప్రారంభించడంపై కాలనీవాసులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ మాజీ కౌన్సిలర్లు ప్రమోద్ రెడ్డి, బాశెట్టి కృష్ణ, కల్పన ఉపేందర్ రెడ్డి, మహదేవరెడ్డి, బిజిలి రాజు, నాయకులు తలారి రాములు, దాసు యాదవ్, లింగం గౌడ్ భాస్కర్ రెడ్డి చంద్రశేఖర్, యునుస్ తో పాటు వివిధ కాలనీల అసోసియేషన్ అధ్యక్షులు కాలనీవాసులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -