Tuesday, June 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరూ.20వేల కోట్ల బిల్లులు చెల్లించండి

రూ.20వేల కోట్ల బిల్లులు చెల్లించండి

- Advertisement -

బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(బీఏఐ) మాజీ అధ్యక్షులు ఎస్‌ఎన్‌.రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి

రాష్ట్రంలో 2017 నుంచి వివిధ శాఖల పరిధుల్లో చేపట్టి, పూర్తయిన పనులకు సంబంధించి దాదాపు రూ.20వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే వాటిని చెల్లించాలని బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(బీఏఐ) మాజీ అధ్యక్షులు ఎస్‌ఎన్‌.రెడ్డి, ఉపాధ్యక్షులు డీవీఎన్‌.రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని ప్రయివేట్‌ హోటల్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ”చలో హైదరాబాద్‌” కార్యక్రమం పోస్టర్‌ ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. చేసిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు ప్రభుత్వం మూడేండ్లుగా బిల్లులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు అప్పులు చేసి మరీ పనులు చేశారని, చెల్లింపులు ఆగిపోవడంతో అప్పు ఇచ్చిన వాళ్లు ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు. చాలా కంపెనీలు మూత పడే పరిస్థితి ఉందని, కొంతమంది కాంట్రాక్టర్లు ఒత్తిడితో గుండెపోటుకు గురయ్యారని, మరికొందరు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు చేసిన ప్రకారంగా పెండింగ్‌ బిల్లులను చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్‌ బిలుల కోసం ప్రభుత్వంపై ఒతిడి తెచ్చేందుకు చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈనెల 18న రాష్ట్రంలోని కాంట్రాక్టర్లంతా కలిసి హైదరాబాద్‌లో మహాసభ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఈ మహాసభలో తదుపరి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైస్‌ చైర్మెన్‌ సీహెచ్‌.శ్రీనివాసరావు, కోశాధికారి సంతోష్‌రెడ్డి, నల్లగొండ సెంటర్‌ చైర్మెన్‌ బి.శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌.కష్ణారావు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -