– సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాల్లో హర్షం : స్థితప్రజ్ఞ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పాత పెన్షన్ పునరుద్ధరణ పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలత పట్ల సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతున్నదని టీఎస్‌సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్‌గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీపీఎస్ రద్దు అంశాన్ని అసెంబ్లీలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ లేవనెత్తడం పట్ల ధన్యవాదాలు ప్రకటించారు. దీనికి సీఎం కేసీఆర్ స్పందిస్తూ పాత పెన్షన్ పునరుద్ధరణ పట్ల సానుకూల దృక్పథంతో ప్రభుత్వం ఉందనీ, ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. సీపీఎస్ ఉద్యోగులు అడిగేది వారి జీవిత భద్రతనే అనీ, రాష్ట్రంలోని 1.72 లక్షల సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగును నింపాలని భావించడం పట్ల కేసీఆర్ వారు కృతజ్ఞతలు ప్రకటించారు.