466 అత్యవసర సేవల వాహనాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో ఆరోగ్య ఎమర్జెన్సీ సేవలను ప్రభుత్వం మరింత పటిష్ఠం చేస్తున్నది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ పీపుల్స్‌ ప్లాజా వద్ద 466 అమ్మ ఒడి, అంబులెన్స్‌, పార్థివదేహాల తరలింపు వాహనాలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జెండాఊపి ప్రారంభించారు. ఇందులో 204 అంబులెన్స్‌లు (108), 228 అమ్మఒడి వాహనాలు, 34 హర్సె వెహికిల్స్‌ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌ రావు, మహమూద్‌ అలీ, ఎమ్మెల్సీ వాణీ దేవి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహారాష్ట్ర పర్యటనకు బయల్దేరారు.
cm-kcr-launched-466-emergency-service-vehicles

Spread the love