గజ్వేల్ లో లక్ష మెజారిటీ తో సీఎం కేసీఆర్ విజయం ఖాయం

నవతెలంగాణ- తొగుట: గజ్వేల్ నియోజకవర్గంలో లక్ష ఓట్ల మెజారిటీ తో సీఎం కేసీఆర్ విజయం ఖాయమని సర్పంచ్ కొల్చేల్మి స్వామి అన్నారు. శనివారం మల్లన్నసాగర్ ముంపు గ్రామం, ఆర్ అండ్ ఆర్ కాలనీ లక్ష్మాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో గ్రామం ముంపునకు గురైన గ్రామ ప్రజలకు 90 శాతం ప్యాకేజీ, ఓపెన్ ప్లాట్లు, వివిధ రకాల పరి హారాలు పూర్తిగా వచ్చాయని అన్నారు.10 శాతం పరి హారాలు రావాల్సి ఉన్నా యని ఎన్నికలు పూర్తి కాగానే అన్ని పూర్తి చేస్తా మని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారని తెలిపారు. ఇప్పటి వరకు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి పూర్తి సహకారం అందించామని, భవిష్యత్ లో అంది స్తామని చెప్పారు. గ్రామంలో ఉన్న ప్రజలం దరు వంద శాతం బీఆర్ఎస్ కి ఓట్లు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా గజ్వేల్ నియో జకవర్గంలో సీఎం కేసీఆర్ కు లక్ష ఓట్ల భారీ మెజా రిటీతో గెలు పిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మూడవ సారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు మాకు అన్ని రకాల పరిహారాలు అందిం చేందుకు కృషి చేసిన సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు కు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. ఇక ముందు భవిష్యత్ లో మా గ్రామా నికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించా లని కోరారు.  మాకు అన్ని విధాల పరిహారాలు  అందించిన సర్పంచ్ స్వామి కి మేము అండగా ఉంటామని గ్రామ ప్రజలు తెలిపారు. అన్ని సహాయ సహ కారాలు అందించిన బీఆర్ఎస్ పార్టీకి గ్రామ స్థులం దరం ఓట్లు వేసి భారీ మెజారిటీని గెలు పిస్తామని అన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో ఉప సర్పంచ్ చింతకింది స్వామి, వార్డు సభ్యులు ఎస్.కనక రాజు, జె.రాములు, పి.చంద్రకళ, పి.రాణి, నాయకు లు వి.బిక్షపతి, సిహెచ్.యాదగౌడ్, పి.పర్శరాములు, ఎం.రాజు, పి.పర్శరాములు, పి.దేవ దాస్, ఎం.లక్ష్మణ్, బీ.పర్శరాములు, టి.కిష్టయ్య,
పి.నాగరాజు, పి.నవీన్ తదితరులు ఉన్నారు.
Spread the love