ఆదిలాబాద్‌కు చేరుకున్న సీఎం రేవంత్

నవతెలంగాణ  – ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అధికారిక కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహించే మోదీ భారీ బహిరంగ సభ కంటే ముందుగా జిల్లాలో సుమారు 6,697 కోట్లతో పలు పనులకు ఆయన భూమి పూజ చేసి పనులు ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లాకు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు స్థానిక ఎరోడ్రంలో ఎలిపాడ్ వద్ద జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కతో పాటు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పీఎస్, ఐటీడీఎపీఓ కుష్బూ గుప్త, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్లు, పలువురు ఐపీఎస్ అధికారులు వారికి పుష్పగుచ్ఛం అందించి సాదర స్వాగతం పలికారు. ప్రధాని జిల్లాకు చేరుకున్న అనంతరం వారు చేసే అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై ఇతర కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.

Spread the love