Sunday, August 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంయాదవుల అభ్యున్నతికి 
సీఎం కృషి

యాదవుల అభ్యున్నతికి 
సీఎం కృషి

- Advertisement -

​రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ సభ్యులు డాక్టర్ వర్రే వెంకటేశ్వర్లు యాదవ్​
వివిధ పదవులు పొందిన వారికి సన్మానం


నవతెలంగాణ – ముషీరాబాద్

​యాదవుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి అభినందనీయమని పూర్వ ప్రధాన సమాచార కమిషనర్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ సభ్యులు డాక్టర్ వరే వెంకటేశ్వర్లు యాదవ్ అన్నారు. ఇటీవల వివిధ కార్పొరేషన్లకు చైర్మెన్‌‌లుగా, ఇతర రాష్ట్రస్థాయి పదవులకు నియమితులైన యాదవ్ నాయకులకు హైదరాబాద్‌ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షు‌లు మేకల రాములు యాదవ్ అధ్యక్షతన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు యాదవ్‌ ‌మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత యాదవ్ సమాజానికి రాజకీయ, పరిపాలనా రంగాల్లో సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ కార్పొరేషన్ చైర్మెన్‌లు తదితర కీలక పదవుల్లో అవకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు. యాదవుల సంప్రదాయ పండుగ సదర్‌ను రాష్ట్ర పండుగగా గుర్తించి అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం యాదవ్ సమాజ ఐక్యతను మరింత బలోపేతం చేస్తుందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న కోకాపేట యాదవ్ భవన నిర్మాణాన్ని త్వరితగతిన ప్రారంభించి యాదవుల ఆత్మగౌరవానికి ప్రతీకగా తీర్చిదిద్దాలని ప్రభుత్వాన్ని కోరారు.

మాజీ పార్లమెంట్ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ శాసనసభ్యులు జైపాల్ యాదవ్ మాట్లాడుతూ.. యాదవ్ సమాజ సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి కోసం అందరూ ఐక్యంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. వంటల జంగా యాదవ్ ఆధ్వర్యంలో యాదవ్ కంఠం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట దేవస్థానం పాలక మండలి సభ్యులు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గొర్రెల–మేకల అభివృద్ధి సహకార సమాఖ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ కె.సరిత తిరుపతయ్య యాదవ్, యాదవ్ కార్పొరేషన్ చైర్మెన్ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్, వైస్ చైర్మెన్‌ గజ్జి భాస్కర్ యాదవ్, మారబోయిన రఘునాథ్ యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర మహిళా అధ్యక్షులు బొంతు శ్రీదేవి యాదవ్, వాస వేణుగోపాల్ యాదవ్, తెలంగాణ ప్రభుత్వ గ్రామ పంచాయతీ డెవలప్‌‌మెంట్ ట్రిబ్యునల్ సభ్యులు, ఎంబి.కృష్ణ యాదవ్, పుల్లారావు యాదవ్, చేవెళ్ల సంపత్ యాదవ్, దేవేందర్ యాదవ్, గుడిగె శ్రీనివాస్ యాదవ్, మారమోని శ్రీశైలం యాదవ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -