Sunday, August 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజూరాల 29 గేట్లు ఎత్తివేత

జూరాల 29 గేట్లు ఎత్తివేత

- Advertisement -

నవతెలంగాణ- ధరూర్‌
జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్‌ మండల పరిధిలోని రేవులపల్లి గ్రామం దగ్గర ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు 29 గేట్లను అధికారులు ఎత్తారు. వరద ఉధృతి నేపథ్యంలో శనివారం ప్రాజెక్టు 29 గేట్లను ఎత్తి, స్పిల్‌వే ద్వారా 145,000 క్యూసెక్కులతోపాటు పవర్‌హౌస్‌, కాల్వల ద్వారా మొత్తం 1,79,884 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యామ్‌లో 8.631 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నెట్టెంపాడు 750 బీమా లిఫ్ట్‌ వన్‌ 1300, కోయిల సాగర్‌ 640, ఎడమ కాలువ 840, కుడి కాలువకు 650, బీమా లిఫ్టు-2కు 872, ప్యానల్‌ కాలువకు 600 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జూరాల మొత్తం మీద దిగువ ప్రాంతానికి లక్ష 79 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్టు అధికారులు తెలిపారు. కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -