Sunday, August 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసీపీఐ(ఎం) పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కుమారుడు మృతి

సీపీఐ(ఎం) పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కుమారుడు మృతి

- Advertisement -

నవతెలంగాణ-భూపాలపల్లి
సీపీఐ(ఎం) పెద్దపల్లి జిల్లా కార్యదర్శి యేల్తూరి యాకయ్య కుమారుడు, భూపాలపల్లి జిల్లా కార్యదర్శి బందు సాయిలు పెద్ద అల్లుడైన యేల్తూరి సమరకేతన్ (34) మృతి చెందాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్సపొందాడు. పరిస్థితి విషమించడంతో శనివారం మరణించాడు.

నివాళులర్పించిన సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు
యేల్తూరి సమరకేతన్ మృతి చెందిన విషయం తెలుసుకున్న సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి చేరుకొని భౌతికకాయానికి నివాళులర్పించారు. మృతుడి ఇరు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసి ఓదార్చారు. పరామర్శించిన వారిలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్, రాష్ట్ర కమిటీ సభ్యులు జె.వెంకటేష్, ఎస్.రమ, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్, రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు, నవతెలంగాణ భూపాలపల్లి స్టాఫ్ రిపోర్టర్ ఎర్రం సతీష్ కుమార్ తదితరులున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -