– వ్యకాస జిల్లా అధ్యక్షులు ములకపల్లి రాములు
నవతెలంగాణ-నేరేడుచర్ల
రాజ్యాంగం రిజర్వేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం సామాజిక న్యాయం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలు కోసం ఈరోజు నేరేడుచర్ల పట్టణ కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం(bkmu) కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (kvps) (dhps) సంఘాల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగాతెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ములకలపల్లిరాములు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా కార్యదర్శి ధూళిపాల ధనంజయ నాయుడు మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు,దౌర్జన్యాలు పెరిగాయన్నారు.మోడీ సర్కారు మనువాద సిద్ధాంతాన్ని అమలు చేస్తూ భారత రాజ్యాంగాన్ని మార్చేసి మనువాద రాజ్యాంగాన్ని అమలు జరపాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా దళితులహక్కులను కాపాడాలని,ప్రయివేట్‌రంగంలో రిజర్వేషన్లు,ఎస్సీ, ఎస్టీ,సబ్‌ప్లాన్ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు జరపాలని డిమాండ్ చేశారు దళితుల హక్కులకోసం డిసెంబర్ 4వ చలో ఢిల్లీ కార్యక్రమానికి వేలాదిగా కదిలి రావాలని పిలుపునిచ్చారు భారత రాష్ట్రపతికి కోటి సంతకాల మెమోరాండాన్ని అందజేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కొదమగుండ్ల నగేష్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు మర్రి నాగేశ్వర్‌రావు, నాయకులు నందిగామసైదులు, తెలుగుదేశం మండల అధ్యక్షులు ఇంజమూరి వెంకటయ్య, సీఐటీయూ జిల్లా నాయకులు కందగట్ల అనంతప్రకాష్,రావుల సత్యం, లక్ష్మీ, చిలకరాజు శ్రీను, కుంకు తిరుపతయ్య, తరంగికష్ణ,కోదాటి సైదులు, కొండఅంజయ్య తదితరులు పాల్గొన్నారు.