
జీపి కార్మికులతో కలిసి 27న నిర్వహించనున్న సిద్దిపేట జిల్లా కలెక్టర్ ముట్టడి విజయవంతం చేయాలని సీఐటీయు మండల నాయకులు సాదిక్ పిలుపునిచ్చారు. దుబ్బాక మండలంలో గ్రామపంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె సోమవారం 19 రోజుకి చేరుకుంది. ఈ సందర్భంగా సీఐటీయు మండల నాయకులు సాదిక్ మాట్లాడుతూ ప్రభుత్వం జీపి కార్మికులు చేస్తున్న సమ్మెను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఏళ్ల తరబడి గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించి, వెంటెనే రాష్ట్ర ప్రభుత్వం వారిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే కార్మికులతో చర్చలకు జరిపి సమస్యలు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ప్రశాంత్, శ్రీను,రవి, శ్రీకాంత్, దుర్గవ్వ, ఎల్లవ్వ, బాబాయి, లచ్చవ్వ తదితరులు పాల్గొన్నారు.