కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు..రైతువేదిక పరిశీలన

నవతెలంగాణ-ఆత్మకూర్‌
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రైతు సదస్సు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ సి క్తాపట్నాయక్‌ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికల్లో శనివారం నిర్వహించే రైతు సదస్సు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు చేసి అధికారులకు పలు సూచనలను సలహాలను ఇచ్చారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అంగరంగ వైబోవంగ నిర్వహించాలని నిర్లక్ష్యం చేయవద్దని అధికారులకు కలెక్టర్‌ సూచించారు. ఉత్సవాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలనీ అన్నారు. కలెక్టర్‌ తో పాటు తహసీల్దార్‌ సురేష్‌ కుమార్‌, ఎంపీడీఓ శ్రీనివాస్‌ రెడ్డి,వ్యవసాయ అధికారి యాదగిరి,ఏంపిఓ చేతన్‌ కుమార్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
దామెర : మండలంలోని రైతు వేదిక, ఊరుగొండ లోని రైతు వేదికను హనుమకొండ జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ శనివారం జరుగు రైతు దినోత్సవ వేడుకలు సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కొన్ని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాము, ఎమ్మార్వో రియాజుద్దీన్‌, ఆర్‌ఐ భాస్కర్‌ రెడ్డి, ఎంపీపీ కాగితాల శంకర్‌, వైస్‌ఎంపీపీ జాకీఆలీ, ఎంపీటీసీ పోలం కపాకర్‌ రెడ్డి, తదితర నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Spread the love