అగ్నిప్రమాదంలో తాటివనం దగ్ధం

నవతెలంగాణ-నడికుడ
మండలంలోని రాయ పర్తిలో శుక్రవారం అగ్ని ప్రమాదం సంభవించి తాటి వనం పూర్తిగా కాలిపోయింది. దానితో పాటు మూడున్నర కిలో మీటర్ల దూరం మంటలు చెలరేగి రైతుల పంటపొలాల దగ్గర ఉన్న బోరు మోటర్లు, పైపులు, రైతులు పశువుల కోసం నిల్వ ఉంచిన దాన కూడా పూర్తిగా అగ్నికి దగ్ధం అయింది.
గ్రామస్తుల సమాచారం ప్రకారం రాయపర్తి గ్రామంలో చెరువులో చాపలు పట్టుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు సిగరెట్‌ తాగికింద పడేయంతో మంటలు వ్యాపించినట్లు సమాచారం. తాటివనం పూర్తిగా కాలిపోవడంతో తమ జీవనోపాధిని కోల్పోయామని గౌడ కులస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

Spread the love