ఇజ్రాయిల్‌తో దౌత్య సంబంధాలకు కొలంబియా తెగదెంపులు

to diplomatic relations with Israel Colombia cutsఇజ్రాయిల్‌ నాయకత్వం మానవ హననానికి పాల్పడుతున్నందున ఇజ్రాయిల్‌తో దౌత్య సంబంధాలను తెంచుకుంటున్నట్టు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో బుధవారం ప్రకటించారు. గాజాలో తక్షణ కాల్పుల విరమణ, మరింత మానవతా సహాయం కోరుతూ మార్చిలో ఆమోదించిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాన్ని అమలుచేయటంలో విఫలమైతే యూదు రాజ్యంతో సంబంధాలను తెంచుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. ఇజ్రాయిల్‌ చేస్తున్న కిరాతక బాంబు దాడులలో చనిపోయిన వేలాది పాలస్తీనా పసిపిల్లల, అమాయక ప్రజలకు అంజలి ఘటిస్తూ ఆయన గాజాలోని పాలస్తీనియన్లకు సంఘీభావం తెలిపారు. ‘ ఇదిగో, మీ ముందు… రిపబ్లిక్‌ అధ్యక్షుడిగా మే 2న, ఇజ్రాయిల్‌తో మారణహౌమానికి పాల్పడుతున్న ఇజ్రాయిల్‌ ప్రభుత్వంతో దౌత్య సంబంధాలను తెంచుకుంటామని నేను ప్రకటిస్తున్నాను” అని అధ్యక్షుడు చెప్పారు. ‘మన కళ్ల ముందు ఒక జాతి నిర్మూలన జరుగుతోంది. పాలస్తీనా మరణిస్తే, మానవత్వం చనిపోతుంది’ అని అన్నాడాయన.
గాజాలో ఇజ్రాయిల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (ఐడిఎఫ్‌) సైనిక ఆపరేషన్‌ ప్రారంభమైన వెంటనే కొలంబియా ఇజ్రాయిల్‌లోని తన రాయబారిని వెనక్కి పిలిపించింది. ఇప్పటివరకు దాదాపు 34,000 మంది పాలస్తీనియన్లు ఇజ్రాయిల్‌ సైనిక దాడులలో చనిపోయారని స్థానిక అధికారులు తెలిపారు. గాజాలో ఇజ్రాయిల్‌ చేస్తున్న మానవ హననాన్ని ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తున్నాయి. బ్రెజిల్‌, చిలీ, బొలీవియా, హౌండురాస్‌, బెలిజ్‌, చాద్‌, జోర్డాన్‌, బహ్రెయిన్‌, టర్కియే, దక్షిణాఫ్రికా గాజాలో ఇజ్రాయిల్‌ చేస్తున్న ఘాతుకాల కారణంగా ఇజ్రాయిల్‌ నుండి తమ రాయబారులను వెనక్కి పిలిపించుకున్నాయి. కొన్నిదేశాలు ఇజ్రాయిల్‌తో సంబంధాలను పూర్తిగా తెంచుకున్నాయి. ఇజ్రాయిల్‌పై ఐక్యరాజ్య సమితి మద్దతు గల అంతర్జాతీయ న్యాయస్థానంలో పాలస్తీనా పౌరులపై మారణహౌమ చర్యలకు పాల్పడుతోందని దక్షిణాఫ్రికా ఆరోపించింది. మారణహౌమాన్ని నిరోధించడానికి ఇజ్రాయెల్‌ సాధ్యమైనన్ని చర్యలను తీసుకోవాలని, అటువంటి చర్యలకు పాల్పడే సైనికులను శిక్షించాలని, పాలస్తీనియన్ల మారణహౌమానికి బహిరంగంగా పిలుపునిచ్చే అధికారులపై ఆంక్షలు విధించాలని కోర్టు తన తీర్పులో కోరింది.

Spread the love