100 బిలియన్‌ యూరోల ఉక్రెయిన్‌ యుద్ధ నిధి ఏర్పాటును

100 బిలియన్‌ యూరోల ఉక్రెయిన్‌ యుద్ధ నిధి ఏర్పాటును– నాటో పిచ్చితనంగా హంగేరి ప్రకటన
రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌కు నిధులు సమకూర్చేందుకు 100-బిలియన్‌ యూరోల (107 బిలియన్‌ డాలర్లు) ఐదేళ్ల నాటో ప్రణాళికను బుడాపెస్ట్‌ వ్యతిరేకిస్తోందని హంగేరియన్‌ విదేశాంగ మంత్రి పీటర్‌ స్జిజార్టో తెలిపారు. సైనిక సహాయ నిధికి సంబంధించిన ముసాయిదా ప్రణాళికను ఈ వారం ప్రారంభంలో సెక్రెటరీ జనరల్‌ జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ అమెరికా నేతత్వంలోని నాటో కూటమిలోని సభ్య దేశాలకు సమర్పించినట్టు స్జిజార్టో వెల్లడించారు. పారిస్‌లో ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కో-ఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఓఈసీడీి) దేశాల మంత్రివర్గ సమావేశానికి వెళ్లే ముందు మంత్రి హంగేరియన్‌ బ్రాడ్‌కాస్టర్‌ ఎమ్‌1తో మాట్లాడుతూ గురువారం ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళవారంనాడు నాటో సభ్య దేశాలు 100 బిలియన్ల యూరోలను సమీకరించాలని సెక్రెటరీ జనరల్‌ ప్రతిపాదనను అందుకున్నాయి. ఈ మొత్తాన్ని నాటో ఉక్రెయిన్‌ యుద్ధం కోసం ఖర్చు చేయాలని యోచిస్తోంది అని హంగేరియన్‌ దౌత్యవేత్త చెప్పాడు. ఐదేళ్లలో ఈ డబ్బును సేకరించవలసి ఉంటుంది కాబట్టి ఉక్రెయిన్‌ యుద్ధం మరో ఐదేళ్ళపాటు కొనసాగుతుందని నాటో భావిస్తున్నట్టుగా అనుకోవచ్చు. హంగరి ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తుంది. ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇవ్వడం లేదా దాని సైనికులకు శిక్షణ ఇవ్వడంలో హంగరి పాల్గొనడం లేదని స్జిజార్టో నొక్కిచెప్పాడు. ముసాయిదా ప్రణాళిక దాని మొదటి పఠనం స్థాయిలోనే బ్లాక్‌ సభ్య దేశాలకు సమర్పించబడిందని, అంటే అది ఇప్పటికీ చర్చలకు లోబడే ఉందని ఆయన చెప్పారు.
”చర్చల సమయంలో రాబోయే వారాల్లో మేము ఈ 100 బిలియన్లను సేకరించి, ఐరోపా నుండి పంపడమనే ఈ పిచ్చి నుండి దూరంగా ఉండటానికి హంగేరి హక్కు కోసం పోరాడుతాము. బుడాపెస్ట్‌ తన స్వంత ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తుంది. యుద్ధం నుంచి దూరంగా ఉండటానికి తన వంతు కషి చేస్తుంది. చర్చల ద్వారా మాత్రమే వివాదం పరిష్కరించబడుతుందని హంగేరి భావిస్తుందని అన్నారు. కొత్త ప్రపంచ యుద్ధం ముప్పు, అణు యుద్ధానికి సన్నాహాలను మేము విస్మరించలేము. ఇక్కడ ఐరోపాలో ఈ పిచ్చిని ఆపాలి, ” అని స్జిజార్టో కోరాడు. ఉక్రేనియన్‌ యుద్ధంలో అమెరికా నేతత్వంలోని నాటో కూటమి – యూరోపియన్‌ యూనియన్ల ప్రమేయంపై హంగేరీ స్థిరంగా తన వ్యతిరేకతను వ్యక్తం చేసింది.
కీవ్‌కు మద్దతు ఇవ్వడానికి లేదా దాని దళాలకు శిక్షణ ఇవ్వడానికి ఆయుధాలను పంపడానికి నిరాకరించింది. మూడవ దేశాల నుండి అటువంటి సరుకులను పంపడానికి తన భూభాగాన్ని ఉపయోగించడాన్ని నిషేధించింది. చాలా కాలంగా ఉక్రేనియన్‌ నాయకత్వం యొక్క ముఖ్య లక్ష్యాలలో ఒకటిగావున్న ఉక్రెయిన్‌ నాటోలో సంభావ్య ప్రవేశానికి వ్యతిరేకంగా బుడాపెస్ట్‌ కూడా బహిరంగంగా మాట్లాడింది ఉంది.

Spread the love