Wednesday, July 8, 2026
E-PAPER
Homeజిల్లాలుఈసీకి వివరణ ఇచ్చాకే రండి

ఈసీకి వివరణ ఇచ్చాకే రండి

- Advertisement -

‘టీఆర్‌ఎస్‌’ ‌పేరుపై ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్య
న్యూఢిల్లీ : ‘టీఆర్‌ఎస్‌’ పేరు మార్పుపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఇచ్చిన నోటీసులకు ముందుగా సమాధానం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు ఆపార్టీ అధ్యక్ష‍ురాలు కల్వకుంట్ల కవితకు సూచించింది. అలాకానిపక్ష‍ంలో న్యాయస్థానం సీఈసీ విధుల్లో జోక్యం చేసుకోవడం అవుతుందని వివరణ ఇచ్చింది. తమ నూతన పార్టీకి ‘తెలంగాణ రక్షణ సమితి’ పేరును ఖరారు చేయాలని కోరుతూ కల్వకుంట్ల కవిత ఢిల్లీ హైకోర్టులో పిటీషన్‌ ‌దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం పై వ్యాఖ్యలు చేసింది. కవితకు కేటాయించిన తెలంగాణ రక్ష‍ణ సమితి పేరు ‘టీఆర్ఎస్’కు అర్థం వచ్చేలా ఉందంటూ జూన్ 23వ తేదీన ఎన్నికల సంఘం నోటీసులు పంపిన విషయం తెలిసిందే. దానిబదులు మరో పేరును సెలెక్ట్‌ ‌చేసుకోవాలని సూచించింది. ఈ నోటీసులపై కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ పేరుపై ప్రజా అభ్యంతరాలు ఉన్నాయంటూ కేంద్ర ఎన్నికల సంఘం దాని రిజిస్ట్రేషన్‌ను తిరస్కరించిన విషయం తెలిసిందే. 15 రోజుల్లో మూడు ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వాలనీ, లేదంటే దరఖాస్తును రద్దు చేస్తామని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -