ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సమస్యలపై కమిటీ సమావేశం..

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గల సమస్యలపై గురువారం రోజు రోగి కళ్యాణ్ సమితి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నీటి సమస్య,  విద్యుత్ సమస్య, ప్లంబింగ్ సమస్య అదే విధంగా సిబ్బంది కొరతపై కమిటీ తీర్మానం చేసినట్లు మెడికల్ ఆఫీసర్ సుజన్ కుమార్ తెలిపారు. తీర్మానాన్ని డిఎంహెచ్ఓ జిల్లా కలెక్టర్ కు పంపినట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ టేకులపల్లి వినిత,  జెడ్పీటీసీ మనోహర్ రెడ్డి, ఎంపీహెచ్ఈఓ రామారావు సూపర్వైజర్ శాంతశ్రీ,  సునంద,  సీనియర్ అసిస్టెంట్ కరీముల్లా, ఎంపీహెచ్ఏ మురళి అశోక్ పాల్గొన్నారు.
Spread the love