విరాళాలు తిరిగి ఇవ్వడం లేదంటూ ఫిర్యాదు..!

– జెడ్పీటీసీ, స్థానికునిపై పోలీస్ స్టేషన్ యందు గ్రామస్తులు 
నవతెలంగాణ – గన్నేరువరం
మండల పరిధిలోని మాదాపూర్ గ్రామంలోని జెడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి,స్థానికుడు మ్యాదరి శ్రీనివాస్ అధ్వర్యంలో చెరువులో దేవాలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేసి గ్రామస్తుల వద్ద విరాళాలు సేకరించారు.గ్రామంలోని కాంగ్రెస్ నేతలు చెరువులో దేవాలయ నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ ఉద్యమం చేపట్టారు.ఇరీగేషన్,హైకోర్ట్ స్పందించి చెరువు శిఖం భూమిలో దేవాలయ నిర్మాణం చేపట్టవద్దంటూ అదేశాలు జారీ చేసింది.
విరాళాలు ఏమయ్యాయి..?
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జెడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి చెరువును పూడ్చి దేవాలయ నిర్మాణం చేపట్టాలని ఒంటెద్దు పోకడతో వ్యవహరించారనే విమర్శలు గ్రామంలో వెల్లువెత్తాయి.మాజీ ఎమ్మెల్యే రసమయి అండతో జెడ్పీటీసీ అడిందే ఆట..పాడిందే పాట అనే విధంగా వ్యవహరించారని గ్రామస్తులు భాహాటంగానే ఆరోపిస్తున్నారు.ఎవరైనా దాతలు, సోంత భూమి విరాళంగా ప్రకటించిన భూముల్లో దేవాలయాల నిర్మాణాలు చేపడుతారు.గ్రామానికి కల్పతరువుగా నిలిచే చెరువును పూడ్చి జెడ్పీటీసీ దేవాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం అహంకారానికి నిదర్శనంగా నిలిచిందని గ్రామస్తులు చెబుతున్నారు.దేవాలయ నిర్మాణం రద్దు అయింది సరే. మరి గ్రామస్తుల నుండి దేవాలయ నిర్మాణానికి సేకరించిన విరాళాలు ఏమయ్యాయనే?..సందేహలు గ్రామంలో వెల్లవెత్తున్నాయి.
తిరిగివ్వడం లేదని ఫిర్యాదు..
చెరువులో దేవాలయ నిర్మాణం పేర గ్రామస్తుల నుండి సేకరించిన విరాళాలు ఏడాదైనా జెడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి,మ్యాదరి శ్రీనివాస్ తిరిగవ్వడం లేదని గ్రామస్తులు కొమ్మెర రవీందర్ రెడ్డి, సంపతి ఉదయ్,మార్గం మల్లేశం,కుమ్మరి సంపత్, సంపతి రాములు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినట్టు తెలిపారు.సేకరించిన విరాళాలను తిరిగివ్వాల్సిందేనని వారు డిమాండ్ చేశారు.
Spread the love