Monday, August 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బిల్డర్‌ విష్ణువర్ధన్ రెడ్డిపై ప్రజావాణిలో ఫిర్యాదు

బిల్డర్‌ విష్ణువర్ధన్ రెడ్డిపై ప్రజావాణిలో ఫిర్యాదు

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మండల పరిధిలోని మేనూరు శివారులో 161వ జాతీయ రహదారి పక్కన ఉన్న కల్వర్టు తూమును బిల్లర్‌ విష్ణువర్ధన్‌రెడ్డి మూసివేశారని రైతు మారేపల్లి వారు గంగారం సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. చుట్టుపక్కన పొలాల్లో బిల్డర్‌ వెంచర్‌ వేశాడనీ, స్థానిక రైతులను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నాడనీ ఫిర్యాదులో పేర్కొన్నారు. అదేవిధంగా పొలాలకు వెళ్ళే రైతులకు దారి లేకుండా చేస్తున్నాడనీ, కల్వర్టు మూసివేతతో పంటలు వరదనీటికి గురయ్యే అవకాశముందనీ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సాయిలు, ఎంపీఓ సత్యనారాయణరెడ్డి, తహశీల్దార్‌ ఎండీ ముజీబ్‌, ఎంఈఓ రాములు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -