నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
గ్రామ మంచినీటి సహాయకులకు భువనగిరి ఎంపీడీవో కార్యాలయం ఏర్పాటు చేసిన శిక్షణ శనివారం ముగిసింది. నాలుగవ రోజు శిక్షణ పూర్తికాగా, వారికి జడ్పీ సీఈఓ ఎన్ శోభారాణి సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ సి ఈ జి లలితా, మిషన్ భగీరథ డీఈ ఈ ప్రశాంత్ కుమార్, గ్రిడ్ డీఈఈ అరుణ, భువనగిరి మండల ఎంపీడీవో శ్రీనివాస్, మిషన్ భగీరథ ఏ ఈ ఈ లు గుండురావ్, శ్రీలత,ల్యాబ్ సిబ్బంది ఝాన్సీరాణి , భువనగిరి మండల సమస్త గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.