
మండలంలోని నాగేపూర్ ఉన్నత పాఠశాలలో నవీపేట్, రెంజల్ మరియు ఎడపల్లి కాంప్లెక్స్ స్థాయి క్విజ్ పోటీలను మంగళవారం నిర్వహించారు. మూడు మండలాల భౌతిక, రసాయన శాస్త్ర ఉపాధ్యాయులతో పాటు 16 ఉన్నత పాఠశాలలోని ఇద్దరు విద్యార్థులు చొప్పున క్విజ్ పోటీలలో పాల్గొన్నారు. జడ్.పి.హెచ్.ఎస్ బాలికల పాఠశాల నవీపేట్ నుండి శ్రీహర్ష, ముభాషిర నాజ్ జెడ్పిహెచ్ఎస్ నీలా గ్రామం నుండి శైలజ, నందినిలు ప్రథమ బహుమతి సాధించగా, కేజీబీవీ నవీపేట్ నుండి లక్ష్మీ ప్రసన్న, స్పందన, జడ్పిహెచ్ఎస్ తాడ్ బిలోలి నుండి అజయ్ కుమార్, సంజనలు ద్వితీయ బహుమతి పొందారు. జడ్పీహెచ్ఎస్ దూపల్లి నుండి రాము, రఘు, జెడ్పిహెచ్ఎస్ నాగేపూర్ నుండి అమృత ప్రియవర్షిని, కీర్తిలు తృతీయ బహుమతిని సాధించారు. వార్షిక పరీక్షల కంటే ముందు విద్యార్థులకు ఇటువంటి క్విజ్ పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రముఖ వక్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఇందిరా, ఉపాధ్యాయులు సాయినాథ్, లక్ష్మీకాంత్, గ్రామ పెద్దలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.