
నవతెలంగాణ- మల్హర్ రావు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం మీనాజిపేట గ్రామ సమీపంలో బక్కన్న, అతని భార్య పై జరిగిన దాడినీ తెలంగాణ కాంగ్రెస్ మేనిపేస్టో చైర్మన్, మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బుధవారం తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఎన్నికల ముందే మొదలు పెట్టిన గుండా రాజకీయం రౌడీ రాజకీయం, ఎలక్షన్ తర్వాత ఎలా ఉంటాదో ఎలాంటి పరిస్తుతులు ఉంటాయో నియోజకవర్గ ప్రజలు అర్దం చేసుకోవాలన్నారు. దౌర్జన్యాలు, గుండా రాజకీయాలు, హత్య రాజకీయలు, రౌడీ రాజకీయలు మొదలు పెట్టిన బీఆర్ఎస్ నాయకత్వాన్ని హాత్య నాయకత్వాన్ని బలపరుస్తున్న కెసిఆర్ కళ్ళు తెరవలన్నారు.బక్కన్న దంపతులపై-దాడీ చేసిన వారిపై కటిన చర్యలు తీసుకోవాలనీ పోలీస్ అధికారులను డిమాండ్ చేశారు.