
సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, కోహెడ, వర్గల్, దుద్దెడ, హుస్నాబాద్, కొండపాక లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి పార్ట్ టైం ప్రాతిపదికన సిద్దిపేట మండలంలోని మిట్టపల్లి లో ఈనెల 28న డెమో నిర్వహించి ఎంపిక చేస్తామని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల జిల్లా కోఆర్డినేటర్ బి.అశోక్ బాబు మంగళవారం తెలిపారు.పార్ట్ టైం పోస్టులు వివరాలు ఖాళీల వారీగా చేర్యాల బాలుర పాఠశాలలో పిజిటి(ఇంగ్లీష్), అర్హతలు ఎంఏ (ఇంగ్లీష్) బీఈడీ, కోహెడ బాలుర జేయల్ (ఇంగ్లీష్), ఎంఏ (ఇంగ్లీష్),బీఈడీ, వర్గల్ బాలుర పిజిటి (మ్యాస్), ఎంఎస్సీ (మ్యాస్),బీఈడీ, దుద్దెడ బాలుర జేయల్ (ఇంగ్లీష్), ఎంఏ (ఇంగ్లీష్) బీఈడీ, హుస్నాబాద్ బాలికల జేఎల్ పిజిటి (మ్యాస్), ఎంఎస్సీ (మ్యాస్) బీఈడీ, కొండపాక బాలికల సిజిటి లకు డెమో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఆసక్తి గల అభ్యర్థులు సర్టిఫికెట్లతో హాజరుకావాలని కోరారు.