
కాంగ్రెస్ భవన్ నందు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్ ,ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు వేణు రాజ్ అధ్యక్షతన రాజీవ్ గాంధీ ఆన్లైన్ యూత్ క్విజ్ కాంపిటీషన్ గురించి సమావేశం గురువారం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ,నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. యువతను మేల్కొల్పే విధంగా కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ ఆన్లైన్ యూత్ క్విజ్ కాంపిటీషన్ నిర్వహిస్తుందని, జూన్ 1వ తేదీ వరకు7661899899 నెంబర్ కు మిస్ కాల్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, జూన్ రెండవ తేదీన ఆన్లైన్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలియజేశారు. పరీక్ష పోటీలో మొదటి బహుమతి ల్యాప్ టాప్, రెండవ బహుమతి స్మార్ట్ ఫోన్, మూడో బహుమతి టాబ్లెట్, అదే విధంగా మహిళా టాపర్లకు ఇ-స్కూటీ ,అదేవిధంగా నియోజకవర్గానికి 10 స్మార్ట్ వాచ్లు, 10 ఇయర్ పాడ్లు, 10 హార్డ్ డ్రైవ్లు,10 పవర్ బ్యాంకులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులు యువకులకు కళాశాలలోని విద్యార్థులకు రాజీవ్ గాంధీ యూత్ క్విజ్ కాంపిటీషన్ గురించి తెలియజేసి ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా చూడాలని, నియోజకవర్గానికి 15000 మంది తగ్గకుండా రిజిష్టర్ చేసుకునే విధంగా యువజన కాంగ్రెస్,ఎన్ఎస్యూఐ నాయకులు కృషి చేయాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి రవీందర్ రెడ్డి, నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రీతం, శశి, ప్రవీణ్, దిగంబర్, వరుణ్, అష్రఫ్, నిఖిల్, మహేష్, ముదాసీర్ తదితరులు పాల్గొన్నారు.