విజయ దుందుభి మోగించిన మహిళలకు శుభాకాంక్షలు

– డా.హిప్నో పద్మా కమలాకర్, జి.కృష్ణవేణి, జ్యోతి రాజా
నవతెలంగాణ – హైదరాబాద్: ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన మహిళలకు ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్, జి.కృష్ణవేణి, జ్యోతి రాజా, డా.స్వరూపారాణీ, యోగా గురు సరోజని రామారావు, డా.క్యార్లిన్ లయన్స్ క్లబ్, యోగా సాధకులు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం డా.హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎంపీ ఎన్నికల కల్లా మహిళా రిజర్వేషన్లు అమలు అయ్యేలా చూడాలని కోరారు. మహిళలు సమస్యలు వెంటనే పరిష్కరించేలా చూడాలని తెలిపారు. ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, కొండా సురేఖ, యశస్విని రెడ్డి, లాస్య నందిత, పద్మావతి మొదలగు మహిళా మణులకు శుభాకాంక్షలు తెలిపారు.

Spread the love