బాధిత కుటుంబానికి పరామర్శ: కాంగ్రెస్

నవతెలంగాణ పెద్దవంగర: మండల కేంద్రానికి చెందిన దీకొండ పరశురాములు (80) వృద్ధాప్యంతో ఆదివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కాంగ్రెస్ పాలకుర్తి నియోజకవర్గ నాయకులు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి బాధిత కుటుంబానికి రూ. 5 వేలు ఆర్థిక సహాయం ప్రకటించగా, ఆ మొత్తాన్ని ఆయన బాధిత కుటుంబానికి అందజేశారు. అనంతరం సురేష్ మాట్లాడుతూ.. కార్యకర్తలు అధైర్య పడొద్దని కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలు అండగా ఉంటుందన్నారు. ఝాన్సీ రెడ్డి కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటుందన్నారు. కార్యక్రమంలో రెడ్డికుంట తండా సర్పంచ్ బానోత్ జగ్గా నాయక్, అనపురం శ్రీనివాస్, సీతారాం నాయక్, వేణు, సతీష్ రెడ్డి, రాంబాబు, అనపురం వెంకన్న, బొమ్మెర వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Spread the love