55 మందితో కాంగ్రెస్‌ తొలి జాబితా

Congress first list with 55 people– వెల్లడించిన కేసీ వేణుగోపాల్‌
– త్వరలో రెండో జాబితా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణలో శాసనసభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్‌ విడుదల చేశారు. మొత్తం 55 మందితో కూడిన ఈ జాబితాను ఆదివారం విడుదల చేశారు. మిగతా స్థానాలపై చర్చించి రెండు, మూడు రోజుల్లో రెండో జాబితాను విడుదల చేయనున్నారు.
త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ రాష్ట్రాలకు కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. మధ్యప్రదేశ్‌లో 230 అసెంబ్లీ స్థానాలకు గాను 144 స్థానాలకు, 90 స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌లో 30 స్థానాలకు, 119 స్థానాలు ఉన్న తెలంగాణలో 55 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.. మొదటి జాబితా ప్రకారం మాజీ ముఖ్యమంత్రి కమల్‌ నాథ్‌ చింద్వారా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. మాజీ సీఎం దిగ్విజరు సింగ్‌ సోదరుడు లక్ష్మణ్‌ సింగ్‌ చచౌరా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. రఘోగఢ్‌ స్థానం నుంచి మాజీ సీఎం కుమారుడు జైవర్ధన్‌ సింగ్‌ బరిలోకి దిగారు. మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పోటీ చేస్తున్న బుధ్ని నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థిగా విక్రమ్‌ మస్తాల్‌ను పోటీకి దింపింది. చుర్హాట్‌ నుంచి అజరు సింగ్‌ రాహుల్‌, రౌ నుంచి జితు పట్వారీ, అతేర్‌ నుంచి హేమంత్‌ కటారే, ఝబువా నుంచి విక్రాంత్‌ భూరియాలను కాంగ్రెస్‌ పోటీకి దింపింది. తొలి జాబితాలో 30 ఎస్టీ కమ్యూనిటీ నియోజకవర్గాలకు, 22 ఎస్సీ సామాజికవర్గాలకు కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది.
ఛత్తీస్‌గఢ్‌లో డిప్యూటీ సీఎం టీఎస్‌ సింగ్‌ డియో తన కంచుకోట అయిన అంబికాపూర్‌ నుంచి బరిలో నిలిచారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌ పటాన్‌ నుంచి పోటీ చేయనున్నారు. సీఎం బఘెల్‌ 2003 నుంచి పటాన్‌ నియోకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌గా పనిచేశారు. ఆయన పటాన్‌ నియోజకవర్గంలో తన మేనల్లుడు, బీజేపీ నేత విజరు బాగెల్‌తో తలపడనున్నారు. అమర్జీత్‌ భగత్‌ మరోసారి సీతాపూర్‌ నుంచి పోటీ చేయనున్నారు. కాగా సీతాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అమర్జీత్‌ భగత్‌ నాలుగుసార్లు గెలిచారు. ఛత్తీస్‌గఢ్‌లో ప్రకటించిన 30 మంది అభ్యర్థుల్లో 14 మంది ఎస్టీ వర్గానికి చెందిన వారున్నారు. అంతేకాకుండా ఈ మొదటి జాబితాలో ముగ్గురు మహిళలకు కూడా టికెట్లు ఇచ్చారు. అయితే తొలి జాబితాలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ తొలగించింది.
జాబితా ఇదే….
1. బెల్లంపల్లి (ఎస్‌సీ) – గడ్డం వినోద్‌
2. మంచిర్యాల – కొక్కిరాల ప్రేమ్‌ సాగర్‌ రావు
3. నిర్మల్‌ – కుచడి శ్రీనివాస రావు
4. ఆర్మూర్‌ – ప్రొద్దుటూరి వినరు కుమార్‌ రెడ్డి
5. బోధన్‌ – పి సుదర్శన్‌ రెడ్డి
6. బాల్కొండ – సునీల్‌ కుమార్‌ ముత్యాల
7. జగిత్యాల – టీ.జీవన్‌ రెడ్డి
8. ధర్మపురి (ఎస్‌సీ) – అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌
9. రామగుండం – ఎంఎస్‌ రాజ్‌ థాకూర్‌
10. మంథని – శ్రీధర్‌ బాబు
11. పెద్దపల్లి – చింతకుంట విజయ రమణారావు
12. వేములవాడ – ఆది శ్రీనివాస్‌
13. మానకొండూర్‌(ఎస్‌సీ) – డా.కవ్వంపల్లి సత్యనారాయణ
14. మెదక్‌ – మైనంపల్లి రోహిత్‌ రావు
15. ఆందోల్‌ (ఎస్‌సీ) – సీ. దమోదర్‌ రాజనర్సింహ
16. జహీరాబాద్‌ (ఎస్‌సీ) – అగం చంద్రశేఖర్‌
17. సంగారెడ్డి – తూరుపు జగ్గారెడ్డి
18. గజ్వేల్‌ – తూముకుంట నర్సారెడ్డి
19. మేడ్చల్‌ – తోటకూర వర్జేస్‌ యాదవ్‌
20. మల్కాజ్‌గిరి – మైనంపల్లి హన్మంతరావు
21. కుత్బుల్లాపూర్‌- కోలన్‌ హన్మంత్‌ రెడ్డి
22. ఉప్పల్‌ – ఎం. పరమేశ్వర్‌ రెడ్డి
23. చేవెళ్ల (ఎస్‌సీ) – పమేన భీమ్‌భారత్‌
24. పరిగి – టీ. రామ్‌ మోహన్‌ రెడ్డి
25. వికారాబాద్‌ (ఎస్‌సీ) – గడ్డం ప్రసాద్‌ కుమార్‌
26. ముషీరాబాద్‌ – అంజన్‌ కుమార్‌ యాదవ్‌
27. మలక్‌పేట్‌ – షేక్‌ అక్బర్‌
28. సనత్‌నగర్‌ – డా.కోట నీలిమ
29. నాంపల్లి – మహ్మద్‌ ఫిరోజ్‌ ఖాన్‌
30. కార్వాన్‌ – ఉస్మాన్‌ బిన్‌ మహ్మద్‌ అల్‌ హజ్రి
31. గోషామహల్‌ – మొగిలి సునీత
32. చంద్రాయణగుట్ట – బోయ నగేష్‌ (నరేష్‌)
33. యాకత్‌పురా – కే. రవి రాజు
34. బహదూర్‌పుర – రాజేష్‌ కుమార్‌ పులిపాటి
35. సికింద్రాబాద్‌ – ఆడమ్‌ సంతోష్‌ కుమార్‌
36. కొడంగల్‌ – ఎనుముల రేవంత్‌ రెడ్డి
37. గద్వాల్‌ – సరిత తిరుపతయ్య
38. అలంపూర్‌ (ఎస్‌సీ)- డా.ఎస్‌ఏ సంపత్‌ కుమార్‌
39. నాగర్‌కర్నూల్‌ – డా.కూచకుళ్ల రాజేష్‌ రెడ్డి
40. అచ్చంపేట (ఎస్‌సీ) – డా.చిక్కుడు వంశీకృష్ణ
41. కల్వకుర్తి – కసిరెడ్డి నారాయణ రెడ్డి
42. షాద్‌నగర్‌ – కే.శంకరయ్య
43. కొల్లపూర్‌ – .జూపల్లి కృష్ణారావు
44. నాగార్జునా సాగర్‌ – జయవీర్‌ కుందూరు
45. హూజర్‌నగర్‌ – నలమాద ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
46. కోదాడ – నలమాడ పద్మావతి రెడ్డి
47. నల్లగొండ – కోమటిరెడ్డి వెంకటరెడ్డి
48. నకిరేకల్‌ (ఎస్‌సీ) – వేముల వీరేశం
49. ఆలేరు – బీర్ల ఐలయ్య
50. స్టేషన్‌ఘన్‌పూర్‌ (ఎస్సీ) – సింగాపురం ఇందిర
51. నర్సంపేట – దొంతి మాధవ్‌ రెడ్డి
52. భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ రావు
53. ములుగు (ఎస్‌టీ) – ధనసరి అనసూయ (సీతక్క)
54. మధిర (ఎస్‌సీ) – భట్టి విక్రమార్క
55. భద్రాచలం (ఎస్‌టీ) – పోదెం వీరయ్య

Spread the love