- Advertisement -
నవతెలంగాణ – జన్నారం : నిరుపేదల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. జన్నారం మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన ప్రేమలతకు తలలో బ్లడ్ క్లాట్ అయి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తరుణంలో వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. వివిధ వ్యాధులతో బాధపడుతూ చికిత్స చేయించుకోలేని నిరుపేదలకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జన్నారం మండల అధ్యక్షుడు నందు నాయక్ పాల్గొన్నారు. కిష్టాపూర్ గ్రామస్తులు ఉన్నారు.
- Advertisement -



