రైతాంగాన్ని ఆదుకునే ప్రణాళికలు కాంగ్రెస్ వద్ద లేవు: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్:  బీఆర్ఎస్ మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తెలంగాణ భవన్ లో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ప్రజలకు, రైతులకు ఉపయోగపడే పనులు చేయలేదని ఆరోపించారు. వేసవి రాకముందే సాగు, తాగునీటి సమస్య తలెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ప్రస్తుతం కేసీఆర్ పరిపాలనాదక్షత ఏంటో ప్రజలకు అర్థమైందని అన్నారు. కరువు కాలంలో కేసీఆర్ ఉంటే ఈ బాధలు ఉండకపోవు అని రైతులు చెబుతున్నారన్నారని తెలిపారు. అలాగే రాష్ట్రంలో వర్షాలు రాకపోతే రైతుల కోసం ఏం చేయాలో కాంగ్రెస్ పార్టీ వద్ద ప్రణాళిక లేదని.. అధికారంలోకి రాగానే డబ్బులు ఎలా రాబట్టుకోవాలనే ధ్యాస మాత్రమే ఉందని ఎద్దేవా చేశారు.

Spread the love