కాంగ్రెస్ పేదల పార్టీ అని మరోసారి రుజువైంది

నవతెలంగాణ – రాయపర్తి

ఇచ్చిన హామీ మేరకు అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ సామాజిక వర్గానికి 18 శాతం సీట్లు కల్పించడంతో కాంగ్రెస్ పార్టీ మరోసారి పేదల పార్టీ అని రుజువు చేసుకుంది అని మాదిగ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గారె వెంకటేష్ మాదిగ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం గర్వించదగిన విషయం అన్నారు. రాష్ట్ర, జాతీయ పార్టీలు నిమ్న జాతులకు ఎన్నికల్లో నిలిచే అవకాశాన్ని కల్పించాలన్నారు. బడుగు బలహీన వర్గాలు అంటే ఓటర్లే కాదు పాలన పగ్గాలు చేపట్టే లీడర్లు అనే విషయాన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలన్నారు. దళితుల కోసం ఇచ్చిన హామీలను బిఆర్ఎస్ పార్టీ ఏ ఒక్కటి అమలు చేయలేదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా తీరు మార్చుకొని ఎస్సీ సామాజిక వర్గానికి సముచిత న్యాయం కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి సదిరపు సాయిలు, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు కొండేటి జోసెఫ్, జిల్లా కార్యదర్శి ఆకులపెళ్లి రవి, మండల నాయకులు గారే సంపత్, ఆకుల పెళ్లి రాజు తదితరులు పాల్గొన్నారు.
Spread the love