బీజేపీ నేతలకు కాంగ్రెస్‌ తీర్థం

బీజేపీ నేతలకు కాంగ్రెస్‌ తీర్థం– కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
బీజేపీకి చెందిన పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలో వారు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత జలంధర్‌రెడ్డి, ఉమ్మడి మెదక్‌ జిల్లా సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జీ పులిమామిడి రాజు తదితరులు రేవంత్‌రెడ్డి సమక్షంలో హస్తం గూటికి చేరుకున్నారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి, మంత్రి కొండా సురేఖ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి తదితరులున్నారు.

Spread the love