కాంగ్రెస్ తోనే అన్ని వర్గాలకు న్యాయం 

– పాలకుర్తి కాంగ్రెస్ ఇన్చార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి 
నవతెలంగాణ – పెద్దవంగర
కాంగ్రెస్ పార్టీ తోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి అన్నారు. మండలంలోని పెద్దవంగర గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ ఆధ్వర్యంలో ఝాన్సీ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఆమె కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా ఇప్పటికే ఐదు గ్యారంటీ పథకాలను అమలు చేసిందని, త్వరలో రైతులకు రుణమాఫీ, మహిళలకు ప్రతీ నెల రూ.2500 నగదు అందిస్తామన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లిందన్నారు. మతోన్మాద బీజేపీ తో దేశానికి ప్రమాదకరమని, రాజ్యాంగాన్ని రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర చేస్తుందని విమర్శించారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ చేతి గుర్తుకు ఓట్లు వేసి కడియం కావ్య ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ లో చేరిన వారిలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బోనగిరి లింగమూర్తి, ఎండీ ఇబ్రహీం, చెరుకు యాకయ్య, జలగం సోమయ్య, చిలుక సోమయ్య, అనపురం చంద్రమౌళి, చిలుక బిక్షం ఉన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హమ్య నాయక్, మండల ఇంచార్జి విజయ్ పాల్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా సంయుక్త కార్యదర్శి ముత్యాల పూర్ణచందర్, పట్టణ అధ్యక్షుడు అనపురం శ్రీనివాస్ గౌడ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు గద్దల ఉప్పలయ్య, సంకెపల్లి రవీందర్ రెడ్డి, శ్రీరాం జగదీష్, సలిదండి సుధాకర్, అనపురం యాకయ్య, చెరుకు అభిరామ్, చిలుక రఘు, రామచంద్రు, మల్లయ్య, యాకయ్య తదితరులు పాల్గొన్నారు
Spread the love