ఎంపీపీ కల్పన కు సన్మానం

నవతెలంగాణ – పెద్దవంగర
పెద్దవంగర ఎంపీపీ గా బొమ్మెరబోయిన కల్పన రాజు యాదవ్ ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆమె ను ఎంపీటీసీ సభ్యులు బానోత్ రవీందర్ నాయక్, ఎర్ర సబిత, ఈరెంటి అనురాధ, బానోత్ విజయ లు ఎంపీపీ ని ఆదివారం కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. మండల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపుతానని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బానోత్ సోమన్న నాయక్, ఈరెంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love