
నవతెలంగాణ – బెజ్జంకి
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అనుచిత వాఖ్యలపై మండల కాంగ్రెస్ నాయకుల కన్నెర్ర చేశారు. మంగళవారం మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మంకాల ప్రవీన్ అధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద బండి సంజయ్ వాఖ్యలను నిరసిస్తూ అయన దిష్టిబొమ్మను యువజన కాంగ్రెస్ శ్రేణులు దహనం చేశారు.అనంతరం ఎంపీ బండి సంజయ్ పై చట్టపరమైన చర్యలు చేపట్టాలని యువజన నాయకులు పోలీస్ స్టేషన్ యందు పిర్యాదు చేశారు. పార్టీ మండల ఉపాధ్యక్షుడు కర్రావుల శంకర్,కిసాన్ సెల్ మండలాధ్యక్షుడు రొడ్డ మల్లేశం,యువజన కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి మచ్చ కుమార్,యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు అమరగొండ రాజు,రంజిత్, నాయకులు శానగొండ శరత్,చెలుకల నరేందర్ రెడ్డి,బొనగం రాజేశం,తిరుపతి రెడ్డి,ఇస్కిల్ల ఐలయ్య,తిప్పారపు మల్లేశం, బొనగం రమేశ్,అమరరాజు నవీన్,బోనగిరి కనకయ్య,అంతయ్య సంగెం రాజేందర్,మినయ్య పాల్గొన్నారు.
స్త్రీలను కించరడం..హిందుత్వాన్ని కించపరచడమే: హిందూ ధర్మం స్త్రీలను గౌరవించే సంప్రదాయమని..హిందుత్వ ముసుగులో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో స్త్రీలను కించపరిచే విధంగా వాఖ్యలు చేయడం హిందుత్వాన్ని కించపరచడమేనని మండల కాంగ్రెస్ నాయకుడు మెట్ట నాగారాజు అగ్రహం వ్యక్తం చేశారు. బీసీ కులగణనకు అసెంబ్లీలో శ్రీకారం చుట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ పై బండి సంజయ్ అనుచిత వాఖ్యలు చేయడం సిగ్గుచేటని అసహనం వ్యక్తం చేశారు.ఎంపీ బండి సంజయ్ ముమ్మాటికి బీసీ ద్రోహియేనని..రాబోయే ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గాల ప్రజలు ఎంపీ బండి సంజయ్ కు తగిన గుణపాఠం చెప్పాలని నాగారాజు సూచించారు.