నవతెలంగాణ – కామారెడ్డి: భారత రత్న, మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ దేశ అభివృద్ధికి దూరదృష్టితో పనిచేసిన మహానేతగా రాజీవ్ గాంధీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. యువతకు సాంకేతిక విప్లవాన్ని అందించిన నాయకుడిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్, మున్సిపల్ కౌన్సిలర్లు, టౌన్ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రాజీవ్ గాంధీకి కాంగ్రెస్ నేతల ఘన నివాళులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



