
నిజామాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు హామీ పథకాలను తీసుకువెళ్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని మాజీ మంత్రి నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ అలీ షబ్బీర్ పట్టణంలో ఆత్మీయ సమ్మేళనాలు, కార్నర్ సమావేశాలు సోమవారం నిర్వహించారు. అందులో భాగంగానే నాగారంలో జరిగిన కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికలు దొరల తెలంగాణకు, ప్రజా తెలంగాణకు మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు.తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక ల్యాండ్, కాంట్రాక్టర్ ఏ దందాలో చూసినా కేసీఆర్ కుటుంబం ఎమ్మెల్యే ల దోపిడీ కనిపిస్తుందని చెప్పారు. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతీ నెలా మహిళలకు రూ. 2500 అందిస్తామని చెప్పారు. అంతేకాకుండా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందజేస్తామన్నారు. గృహ జ్యోతి ద్వారా ప్రతీ ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పారు. తెలంగాణలో దొరలపాలనను సాగనంపి. ప్రజా తెలంగాణను ఏర్పాటు చేసుకుందామని పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని వెల్లడించారు.ప్రత్యేక తెలంగాణలో ప్రజల గొంతు వినిపించుకోవచ్చు అనుకున్నాం కానీ వినిపించే గొంతులను దొరల పాలనలో అణచివేస్తున్నారన్నారు. తెలంగాణలో ప్రజల రాజ్యం నడవాలని సోనియమ్మ తెలంగాణ ఇచ్చారని, సోనియమ్మ ఆకాంక్ష దొరల తెలంగాణ కాదని చెప్పారు. తెలంగాణ ఒకే కుటుంబం చేతిలో బందీ అయిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వారు చేసిన అవినీతి అంతా కక్కిస్తామన్నారు. బీఆర్ఎస్. బీజేపీ. ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తామో చెప్పకుండా . నీవెంత దోచుకున్నావు నువ్వు ఎంత సంపాదించుకున్నావో చెప్పు అంటూ సవాలు ప్రతి సవాలు విసురుకుంటూ కాంగ్రెస్ పార్టీ నుండి ప్రజల దృష్టిని మల్లించాలని చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నగర పార్టీ అధ్యక్షులు కేశ వేణు,ధర్మపురి సంజయ్, రత్నాకర్, నజీబ్ అలి, జావిద్ అక్రమ్. అబ్దుల్ ఎజాస్. షాదాబ్ హుస్సేన్. అబ్దుల్ ముఖిం, ఇర్ఫాన్అలీ, మోయిన్, గౌస్ అన్వర్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.