– 19 మంది అభ్యర్థులు ఖరారు..
– బీజేపీ బహిష్కరణ ఎమ్మెల్యే శోభారాణికి టికెట్
జైపూర్: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఒకదాని తర్వాత ఒకటి జాబితాలను విడుదల చేయడం ప్రారంభించింది. తాజాగా మూడో జాబితాను కూడా గురువారం విడుదల చేశారు.బీజేపీ, కాంగ్రెస్‌లు ఇప్పటి వరకు రెండు జాబితాలను విడుదల చేశాయి. బీజేపీ రెండు జాబితాల్లో 124 మంది పేర్లు ఖరారు చేయగా, కాంగ్రెస్ 76 మంది పేర్లను ప్రకటించింది. ఇప్పుడు మూడో జాబితాలో 19 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. బీజేపీ బహిష్కరణ ఎమ్మెల్యే శోభారాణికి టికెట్ ఇచ్చారు. ఈ మూడు జాబితాలతో కాంగ్రెస్ 95 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది.