యాచారంలో కానిస్టేబుల్ ఆత్మహత్య

నవతెలంగాణ – హైదరాబాద్
నగరంలోని యాచారంలో కానిస్టేబుల్‌ ఆత్మహత్య. అయితే సదరు కానిస్టేబుల్ ఏ కారణంతో ఆత్మహత్య చేసుకున్నాడో తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. యాచారంలో వినోద్ అనే కానిస్టేబుల్ తలవెంట్రుకలు ఊడిపోతున్నాయనే కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు వినోద్ మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అనారోగ్యం కారణంగా గత మార్చ్ నుంచి వినోద్ సిక్‌ లీవ్‌లో ఉన్నాడు. చివరకు ఈరోజు వినోద్ ఆత్మహత్య చేసుకున్నాడు. తలవెంట్రుకలు ఊడిపోతున్నాయనే కారణంగానే వినోద్ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Spread the love