
– హర్షం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు హర్షం
– సీఎం, మంత్రి, ఎంపీ ల చిత్రపటాలకు పాలాభిషేకం
నవతెలంగాణ-దుబ్బాక రూరల్
నగరం గ్రామ శివారులోని చిన్నవాగు పై చెక్ డ్యామ్ నిర్మాణంతో రైతులకు మేలు జరుగుతుందని, ఆ చెక్ డ్యాం నిర్మాణానికి 2.28 కోట్ల నిధులు మంజూరు పట్ల శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు అక్బర్ పేట్ భూంపల్లి మండలం పరిధిలోని నగరం గ్రామం పంచాయతీ కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా టిఆర్ఎస్ మండలాధ్యక్షుడు జీడిపల్లి రవీందర్ మాట్లాడుతూ… చెక్ డ్యాం నిర్మాణంతో రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. రైతుల కళ్ళల్లో ఆనందం నింపడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ముమ్మాటికీ రైతుల శ్రేయస్సు నే కోరుకుంటుందని అన్నారు. పార్టీ కి రైతుల అభిమానం అండగా ఉండి రాబోయే ఎన్నికల్లో కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని అన్నారు. కార్యక్రమంలో నగరం గ్రామ అధ్యక్షులు తిరుపతి గౌడ్, ఆత్మ కమిటీ డైరెక్టర్ జీడిపల్లి కిషన్, రైతు కమిటీ డైరెక్టర్ సిద్ధి రాములు, వార్డు మెంబర్లు, సీనియర్ నాయకులు, మాజీ గ్రామ అధ్యక్షులు, రైతులు, ప్రజలు, సొసైల్ మీడియా, యువజన విభాగం అధ్యక్షులు పాల్గొన్నారు.