కేంద్ర నిధులతో తరగతి గదుల నిర్మాణం 

Construction of classrooms with central funds– భూమి పూజ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే 
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
కేంద్ర ప్రభుత్వం నిధులతో గిరిజన కళాశాల లో అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం గిరిజన సంక్షేమ శాఖ నుండి ఆర్టికల్ 275/1 కింద 75 లక్షల రూపాయలు మంజూరు అయినట్లు ఆదిలాబాద్ ఎంపీ నగేష్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ నగేష్ మాట్లాడుతూ… గిరిజన బాలికల జూనియర్ కళాశాలలో సుమారుగా వెయ్యి మంది విద్యార్థులు అభ్యాసిస్తున్నారన్నారు. అదనపు తరగతి గదుల కోసం రూపాయలు 75 లక్షలతో గదుల నిర్మాణం చేపడం జరుగుతుందన్నారు. విద్యార్థులు, సిబ్బంది మరిన్ని సౌకర్యాలు కల్పించాలని కోరినట్లు తెలిపారు. వారి కోరిక మేరకు ఈ నిర్మాణం పూర్తయ్యేలోగా మరిన్ని నిధులు తో మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు బాగా చదవాలని సూచించారు. నైతికమైనటువంటి  విద్యను బోధించాలని ఉపాధ్యాయులను సూచించారు.
Spread the love