నవతెలంగాణ-గంగాధర : రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో.. బీసీలను విమర్శిస్తే చూస్తూ ఊరుకోమంటూ చొప్పదండి నియెాజక వర్గ మున్నూరు కాపు సంఘం మండి పడ్డారు. గంగాధర మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మున్నూరు కాపు సంఘం చొప్పదండి నియోజక వర్గ కన్వీనర్ మడ్లపెల్లి శ్రీనివాస్, ఏఎంసీ వైస్ ఛైర్మన్ సామంతుల శ్రీనివాస్ మాట్లాడారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీలో మారే విషయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందు వరసలో ఉన్నారనే విషయం విస్మరించారని అన్నారు. మొదట బీఆర్ఎస్, ఆ తర్వాత టిడిపి, ఇప్పుడు కాంగ్రెస్ ఇలా వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీలు మారిన చరిత్ర రేవంత్ రెడ్డిదని అన్నారు. మున్నూరు కాపు సంఘం నాయకులు గంట కిషన్, పులిచెర్ల లక్ష్మీనరసయ్య, దేశెట్టి నరసయ్య, గడ్డ సంజీవ్ పాల్గొన్నారు.