కాన్వకేషన్ ఫీజును వెంటనే తగ్గించాలి: ఎస్ఎఫ్ఐ

నవతెలంగాణ – కంటేశ్వర్
700 కాన్వకేషన్ ఫీజును ఐదు రెట్లు పెంచిన కాన్వకేషన్ ఫీజులు వెంటనే తగ్గించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విగ్నేష్ మాట్లాడుతూ.. ఈనెల 26 తేదీన తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ పీజీ పాసైన విద్యార్థులు తీసుకునే కాన్సోల్డేటెడ్ మెమో, ఓడి, కాన్వకేషన్ మెమో లకు సంబంధించిన ఫీజులను 700 వందల నుండి 3500 లు అనగా ఒకేసారి ఐదు రేట్లు ఫీజులు పెంచడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కాన్వకేషన్ ఫీజుకు సంబంధించి ఇతర యూనివర్సిటీలైన ఓయూ, కాకతీయ, శాతవాహన కన్నా అధికంగా తెలంగాణ యూనివర్సిటీ యంత్రాంగం కాన్వకేషన్ సంబంధించిన ఫీజులను పెంచడం దారుణం అని అన్నారు. కాన్వకేషన్ ఫీజుల పేరిట విద్యార్థుల పైన భారాన్ని మోపడం సరికాదని వెంటనే ఇంచార్జ్ వైస్ ఛాన్స్లర్ బుర్ర వెంకటేశం గారు స్పందించి కాన్వకేషన్ ఫీజును తగ్గించాలని లేకపోతే ఎస్ ఎఫ్ ఐ గా భవిష్యత్తులో ఉద్యమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ తెలంగాణ యూనివర్సిటీ సహాయ కార్యదర్శి పవన్, విశాల్, రఘు తదితర నాయకులు పాల్గొన్నారు.
Spread the love