నవతెలంగాణ- మద్నూర్: మద్నూర్ మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయంలో మంగళవారం నాడు సహకార వారోత్సవాలను విండో కార్యదర్శి జె బాబురావు జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 70 వ అఖిలభారత సహకార వారోత్సవాలను ఈనెల 14 నుండి 20వ తేదీ వరకు జరుపుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. సింగిల్ విండో సిబ్బంది షాదుల్ విట్టల్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.