
– వేములవాడ డిఎస్పీ నాగేంద్రచారి..
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ పరిధిలో ఉన్న బెల్ట్ షాప్ లపై కోరడ..నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని డి.ఎస్.పి నాగేంద్ర చారి హెచ్చరించారు. ఈ సందర్భంగా వేములవాడ డిఎస్పీ మాట్లాడుతూ..పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు వేములవాడ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న గ్రామాల్లో ,పట్టణాల్లో ఉన్న బెల్ట్ షాప్ ల పై దాడులు నిర్వహించి 55 కేసులల్లో 31,2,374/- రూపాయల విలువ గల ,584 లీటర్ల మద్యం సీజ్ చేయడం జరిగిందని అన్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో 68 కేసులల్లో 255500 /- రూపాయలు విలువ గల 417 లీటర్ల మద్యం సీజ్ చేసి ఉక్కుపాదం మోపడం జరిగిందని తెలిపారు. గ్రామాల్లో, పట్టణాల్లోని ఇండ్లలో, హోటల్లలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో, కిరాణా షాపులలో, ఇతర దుకాణాలలో నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ప్రభుత్వ పర్మిషన్ లేకుండా అక్రమంగా బెల్ట్ షాప్ నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని,వైన్స్ యజమానులు కూడా నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాప్ నిర్వాహకులకు మద్యం అమ్మకాలు జరిపితే కేసులు నమోదు చేయడం జరుగుతుందని డిఎస్పీ తెలిపారు.