విద్యుద్ఘాతానికి గురై ఆవు మృత్యువాత

నవతెలంగాణ – బెజ్జంకి
విద్యుద్ఘాతానికి గురై ఆవు మృత్యువాత పడిన సంఘటన మండల పరిధిలోని బేగంపేట గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. విద్యుత్ ట్రాన్స్ పార్మర్ దగ్గర ఆవు మేత మేసుకుంటూ వేళ్తున్న క్రమంలో విద్యుద్ఘాతానికి గురై సుమారు రూ.70 వేల విలువైన ఆవు మృత్యువాత పడినట్టు బాధితుడు కొర్వీ మహేశ్ అవేదన వ్యక్తం చేశారు. సంబధిత అధికారులు విచారణ చేపట్టి న్యాయం చేయాలని బాధితుడు విజ్ఞప్తి చేశాడు.

Spread the love