బహిరంగ సభను విజయవంతం చేయాలి: సీపీఐ ఎంఎల్

నవతెలంగాణ – డిచ్ పల్లి
(సీపీఐ ఎంఎల్ ప్రజా పంధా) (పీసీసీ సీపీఐ ఎంఎల్) (సీపీఐ ఎంఎల్ అర్ ఐ) మూడు విప్లవ పార్టీల ఐక్యత యూనిట్ మహాసభ మార్చి 3 4 5 తేదీలలో ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని సీపీఐ ఎంఎల్ ప్రజా పంథా జిల్లా కార్యదర్శి వనమల కృష్ణ అన్నారు. గురువారం డిచ్ పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014 లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నల్లధనాన్ని వెలికి తీసి ప్రజల ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామని, స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేసి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. దేశంలో ఉన్న ఇతర విప్లవ పార్టీలు ఓకే పార్టీగా ఐక్యం అయ్యేందుకు పార్టీలు కృషి చేయాలని విప్లవ పార్టీలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ ప్రజా పంధా డివిజన్ కార్యదర్శి వెంకన్న, సహాయ కార్యదర్శి సాయగౌడ్, మండల కార్యదర్శి మురళి,  కిషన్ ,మోహన్, సాయి బాబా తదితరులు పాల్గొన్నారు.
Spread the love