పేదలువేసుకున్న అన్ని ప్రభుత్వ భూములలో గుడిసెలు నిర్మించుకున్న నిరుపేదలందరికీ పట్టాలిచ్చి,ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని సీపీఐ హనుమకొండ జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక తాసిల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. మండలంలోని సర్వే నంబర్ 1058 లోని ప్రభుత్వ భూమి గత 18 సంవత్సరాల క్రితం నిలువ నీడలేని ఇండ్ల స్థలాలు లేని నిరుపేదలు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు గుడిసెలు వేసుకుని చిన్న చిన్న రేకుల షెడ్లతోటి జీవనం కొనసాగిస్తున్నారు. గత పది సంవత్సరాలుగా ప్రభుత్వము పట్టించకపోవడంతో నిరుపేదలు నిలువ నీడ లేక తినడానికి తిండి లేక సరియైన వైద్య సౌకర్యం లేక నాన్న ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ ప్రభుత్వంలోనైనా ప్రతి పేద వాడిని గుర్తించి వారికి కావలసిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సీపీఐ ధర్మసాగర్ మండల సమితి పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మసాగర్ మండల కార్యదర్శి కొట్టే వెంకటేష్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మునిగాల బిక్షపతి, సీపీఐ జిల్లా సమితి సభ్యులు మాలోత్ శంకర్ నాయక్, సిపిఐ సీనియర్ నాయకులు సింగారపు కొమురయ్య, వల్లెపు సారయ్య, తదితరులు పాల్గొన్నారు.