మేడారంలో భక్తుల సందడి

– వనదేవతలకు ప్రత్యేక మొక్కులు
నవతెలంగాణ – తాడ్వాయి
మేడారంలో సమ్మక్క- సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వనదేవతలకు ఆదివారం భక్తులు ప్రత్యేక ముక్కలు చెల్లించారు. జంపన్న వాగు వద్ద పుణ్య స్థానాల ఆచరించి, కళ్యాణ కట్ట వద్ద తలనీనాలు సమర్పించి, గద్దెల వద్దకు చేరుకుని వనదేవతలకు ఇష్టమైన పసుపు, కుంకుమ, చీరే సారే సమర్పించి ప్రత్యేక మొక్కలు చెల్లించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా, సరిహద్దు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో భారీగా తరలివచ్చారు. వీరికి ఎండోమెంట్ అధికారులు, పూజారుల ఆద్వర్యంలో భక్తులకు సకల సౌకర్యాలు కల్పించారు. వనదేవతలను దర్శించుకున్న అనంతరం బయట చెట్ల కింద విడిది చేసి సహపంక్తి భోజనాలు ఆరగించారు. అనంతరం ఎవరి ఊర్లకు వారు తిరుగు ప్రయాణం చేశారు. పూజారులు కొక్కర కృష్ణయ్య, సిద్ధబోయిన రమేష్, మునీందర్, సిద్దబోయిన పాపారావు, అరుణ్, కాక సారయ్య, కాక కిరణ్, ఎండోమెంట్ అధికారులు క్రాంతి, రాజేశ్వర్, రమాదేవి, జగదీశ్వర్, బాలకృష్ణ మధు తదితరులు పాల్గొన్నారు.

Spread the love