కరెంట్‌ అఫైర్స్‌

1. అరుదైన చేప: ఇటీవల శాస్త్రవేత్తలు జపాన్‌కు దక్షిణంగా వున్న ఇజు – ఒగాసవారా ట్రెంచ్‌లోని లోతైన ప్రాంతంలో హడల్‌ జోన్‌ (చీకటి ప్రాంతం) లో ఒక అరుదైన చేపను గుర్తించారు. వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం, టోక్యో వర్మిటి ఆఫ్‌ మెరైన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తల బృందం పరిశోధనలో భాగంగా గుర్తించారు.
అత్యంత లోతైన ప్రాంతం సముద్ర ఉపరితలానికి సుమారు 5 మైళ్ల లోతు (27,349 అడుగులు) 800 – 1000 రెట్ల అధిక పీడనంలో ఈ చేప జీవించగలగడం అరుదైన విషయంగా రికార్డులకెక్కింది. దీనికి ‘నత్త చేప’గా శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. దీనికి చీకటిలో వెలుతురు వెదజల్లే లక్షణం కూడా వున్నట్లు గుర్తించారు.
2. డిపెండింగ్‌ ఛాంపియన్‌ భారత పురుషుల కబడ్డీ జట్టు ఆసియా ఛాంపియన్‌ షిప్‌ టైటిల్‌ను నిలబెట్టుకొంది. ఫైనల్‌లో భారత్‌ 42 – 32 తో ఇరాన్‌ పై ఘన విజయం సాధించింది. భారత్‌కు ఇది 8వ ఆసియా టైటిల్‌ కావడం విశేషం.
3. తుషార్‌ మెహతా కొనసాగింపు : సీనియర్‌ న్యాయవాది తుషార్‌ మెహతా భారత సొలిసిటర్‌ జనరల్‌గా మళ్లీ నియమితులయ్యారు. 2018 లో మొదటిసారిగా సొలిసిటర్‌ జనరల్‌గా నియమితులైన తుషార్‌ మెహతా పదవీ కాలాన్ని ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు పొడిగించింది. తాజాగా 3వ సారి మరో మూడేళ్లు ఆయన్ను నియమిస్తూ సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనతో పాటు సుప్రీం కోర్టు 6 అదనపు సొలిటర్‌ జనరల్‌ ను మూడేళ్ల కాలానికి పునర్నియమించింది. వీరు విక్రమ్‌ జీత్‌ బెనర్జీ, కె.ఎం. నటరాజ్‌, ఒల్బీర్‌ సింగ్‌, ఎస్‌.వి. రాజు, ఎన్‌.వెంకటరామన్‌, ఐశ్వర్య బాట.
4. అత్యంత ఖరీదైన చిత్రం : లేడీ విత్‌ ఎ ఫ్యాన్‌.
ఆస్టియా కళాకారుడు గుస్తావ్‌ క్లిమ్ట్‌ గీసిన లేడీ విత్‌ ఎ ఫ్యాన్‌ చిత్రం లండన్‌లోని సోత్‌ బీ లో ఇటీవల జరిగిన వేలంలో రూ.8854 కోట్లు పలికింది. యూరప్‌లో ఇప్పటి వరకు అమ్ముడైన అత్యంత ఖరీదైన చిత్రంగా రికార్డులకెక్కింది.
5. భారత్‌ చర్యలకు ప్రశంసలు : చిన్న పిల్లలు సాయుధ పోరాటాల వైపు వెళ్లకుండా కట్టడి చేసినందుకు గాను ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ వార్షిక నివేదిక నుంచి భారత్‌ పేరును తొలగించినట్లు యూ.ఎన్‌. సెక్రటరీ జనరల్‌ అంటొనియో గుటెరస్‌ తెలిపారు. సాయుధ ఘర్షణల ప్రభావం పడకుండా చిన్నారులు మెరుగైన సంరక్షణ కోసం భారత్‌ తీసుకున్న చర్యలను గుటెరస్‌ ప్రశంసించారు. 2010 నుంచి భారత్‌ పేరు ఈ నివేదికలో వుంటూ వచ్చింది. బాలల హక్కుల పరిరక్షణకు కశ్మీర్‌లో ఒక మిషన్‌ను ఏర్పాటు చేయడంపై గుటెరస్‌ హర్షం వ్యక్తం చేశారు. బాలల సంక్షేమం కోసం చేపట్టిన చర్యలతో చత్తీస్‌గఢ్‌, అసోం, జార్ఖండ్‌, ఒడిశా, జమ్ము కాశ్మీర్‌ లలో బాలల సంరక్షణ మెరుగుపడిందని ఈ నివేదికలో వెల్లడించింది.
6. ఫ్రాన్స్‌లో జనాగ్రహం : పారిస్‌కు సమీపంలో ట్రాఫిక్‌ సిగల్‌ అతిక్రమించినందుకు, కారు ఆపమన్నప్పుడు ఆపనందుకు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని నేరానికి 17 ఏళ్ల నల్లజాతి టీనేజన్‌ను ఓ పోలీస్‌ అతి సమీపం నుంచి తుపాకీ తో కాల్చి చంపిన వీడియో ప్రజాగ్రహం పెల్లుబికేలా చేసింది. పాశవిక చర్యకు పాల్పడిన ఆ పోలీస్‌పై చర్య తీసుకోకపోవడంతో యువత వీధుల్లోకి వచ్చి కార్లు తగులబెట్టి, స్కూళ్లు, ఆసుప్రతులు, పోలీస్‌ స్టేషన్ల పై దాడి చేసి, లాఠీ చేసే పరిస్థితి తెచ్చింది. శాంతిబధ్రతల పునరుద్ధారణకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ వేలాది భద్రతా సిబ్బందిని బరిలోకి దించడం జరిగింది.
7. నెల్లూరు జాతి ఆవు 35 కోట్లు : నెల్లూరు జాతికి చెందిన తెల్ల ఆవు బ్రెజిల్‌లో ఇటీవల జరిగిన వేలంలో 35.30 కోట్లు పలికి ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆవుగా రికార్డులకెక్కింది.
‘వియాటినా – 19 ఎఫ్‌ 4 మారా ఇమ్‌విస్‌’ అనే నాలుగున్నర ఏళ్ల ఆవు 3వ వంతు యాజమాన్య హక్కు రూ.11.82 కోట్లకు అమ్ముడుపోయింది. గతేడాది ఈ ఆవు సగం యాజమాన్య హక్కు రూ.6.5 కోట్లు పలకడం అప్పట్లో రికార్డు సృష్టించగా ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది. మొత్తం మీద ఈ ఆవు విలువ 35.30 కోట్ల రూపాయలు పలికింది. బ్రెజిల్‌లో 16.70 కోట్ల నెల్లూరు జాతి ఆవులు వున్నాయి. మొత్తం ఆవుల సంఖ్యలో ఇవి 80 శాతం కావడం విశేషం.
– కె. నాగార్జున
కరెంట్‌ ఎఫైర్స్‌ సీనియర్‌ ఫ్యాకల్టీ
9490352545

Spread the love