22 వరకూ హేమంత్‌ సోరెన్‌కు కస్టడీ పొడిగింపు

రాంచీ : మనీలాండరింగ్‌ కేసులో ఈడీ అరెస్టు చేసిన జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు ఈ నెల 22 వరకూ జ్యుడిషియల్‌ కస్టడీని పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టు గురువారం పొడిగించింది. ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి తరపున న్యాయవాది, అడ్వకేట్‌ జనరల్‌ రాజీవ్‌ రంజన్‌ విలేకరులకు తెలిపారు. భూకుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలతో హేమంత్‌ సోరెన్‌పై మనీలాండరింగ్‌ కేసును ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 31న రాత్రి సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ నెల 2న ముందుగా ఐదు రోజుల కస్టడీ విధించిన కోర్టు, తరువాత దానిని మరో ఏడు రోజులకు పొడిగించింది. మరోసారి మళ్లీ ఏడు రోజుల పాటు పొడిగించింది.

Spread the love